పంజాగుట్ట, వెలుగు: పేద ప్రజలకు ఉచితంగా న్యాయ సేవలు అందించాలని మంత్రి వివేక్ వెంకటస్వామి సూచించారు. సోమవారం పంజాగుట్ట సర్కిల్ సమీపంలో ‘సంజయ్ కామ్లె అండ్ అసోసియేట్స్’ లీగల్ కన్సల్టెంట్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద, మధ్యతరగతి ప్రజలు అవగాహన లేక న్యాయం పొందడంలో ఇబ్బందులు పడుతున్నారని, వాటిని తొలగించేందుకు న్యాయవాదులు కృషి చేయాలని కోరారు.
అనంతరం న్యాయవాదులు మంత్రిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రిటైర్డ్ ఎన్సీఎల్టీ జడ్జి పూండ్ల భాస్కర్ మోహన్, న్యాయవాదులు కార్తీక్, సంజయ్ కామ్లె, నల్లమల్లి దివ్యశ్రీ తదితరులు పాల్గొన్నారు.
