రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది : వివేక్ వెంకట స్వామి

రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయింది : వివేక్ వెంకట స్వామి

మంచిర్యాల/ఆసిఫాబాద్ : రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పని అపోయిందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి అన్నారు. సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలతో ప్రజలు విసిగిపోయారని చెప్పారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలంలోని చెంద్రవెల్లి గ్రామంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీని బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు అంకితభావంతో పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదని బీజేపీ వైపే  ప్రజలు చూస్తున్నారని వివేక్ అభిప్రాయపడ్డారు.  ఈనెల 10వ తేదీ నుంచి 26వ తేదీ వరకు బీజేపీ కార్నర్ సమావేశాలు జరుగుతాయని, 10వ తేదీలోగా పార్టీ శక్తి కేంద్రాల సమావేశాలు పూర్తి చేయాలని నాయకులను వివేక్  ఆదేశించారు.