కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆస్తులు పెంచుకుంది : వివేక్ వెంకటస్వామి

కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆస్తులు పెంచుకుంది :  వివేక్ వెంకటస్వామి

ప్రెస్మీట్లో మంత్రి కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి అన్నారు. ఇది తెలంగాణ సంస్కారం కాదని, అమెరికాలో చదువుకున్న సంస్కారం ఇదేనా అని కేటీఆర్ ను ఆయన ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో పర్యటించిన ఆయన ఓ  వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఉపాద్యాయుల సమస్యలపై  వివేక్ వెంకటస్వామికి తపస్ ఉపాద్యాయ సంఘ నేతలు వినతిపత్రాన్ని అందించారు.

విద్యావ్యవస్థను సీఎం కేసీఆర్  నిర్విర్యం చేశాడని వివేక్  ఆరోపించారు. టీచర్లకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితి నెలకొందని, ప్రభుత్వం వారి బదిలిల సమస్యపై  పట్టించుకోవడం లేదన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఎవరైతే కొట్లాడారో వారిని కేసీఆర్ పక్కన పెట్టారని చెప్పారు.  రాష్ట్రం  అవినీతిలో నంబర్ వన్గా ఉందని వివేక్ ఆరోపించారు. కేటిఆర్, కవిత ఇంటర్వ్యూలు చూస్తుంటే అర్థం అయిందన్నారు. కల్వకుంట్ల కుటుంబం రాష్ట్రాన్ని దోచుకొని ఆస్తులు పెంచుకుందని అన్నారు. అవినీతి చేయకపోతే సీబీఐ,ఈడీలకు ఎందుకు భయపడుతున్నారని వివేక్ ప్రశ్ని్ంచారు. కేసీఆర్ అవినీతి కుటుంబ పాలనకు గుణపాఠం చెప్పాలని ప్రజలు అనుకుంటున్నారని. వచ్చే ఎన్నికల్లో కారు పంక్చర్ కావడం ఖాయమన్నారు.