కేసీఆర్.. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు : వివేక్ వెంకటస్వామి ఛాలెంజ్

కేసీఆర్.. దమ్ముంటే రాజకీయంగా కొట్లాడు : వివేక్ వెంకటస్వామి ఛాలెంజ్

కేసీఆర్ ఫ్యామిలీపై వివేక్ వెంకటస్వామి ఫైర్ అయ్యారు. తప్పుడు ఆరోపణలతో తన సంస్థలపై ఐటీ, ఈడీ దాడులు చేయించారని మండిపడ్డారు. కేసీఆర్ దమ్ముంటే రాజకీయంగా కొట్లాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి పేరుతో కేసీఆర్ వేల ఎకరాలను కబ్జా చేశారని తెలిపారు. కేసీఆర్ సర్కార్ అవినీతిపై ఎన్ని సాక్షాలిచ్చిన కేంద్రం చర్యలు తీసుకోలేదని వివేక్ విమర్శించారు. 

చెన్నూరులో ఓడిపోతాననే భయంతో తప్పుడు ఆరోపణలతో తనపై బాల్క సుమన్ ఫిర్యాదు చేశారని వివేక్ వెంకటస్వామి అన్నారు. బాల్కసుమన్ కంప్లేంట్ చేస్తేనే.. ఈడీ నాపై రైడ్స్ చేసిందని తెలిపారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని చెప్పారు. ఐటీ చెల్లింపుల్లో విశాఖ ఇండస్ట్రీస్ బెస్ట్ అని.. అధికారులే విశాఖ ఇండస్ట్రీస్ ను అభినందించారని గుర్తు చేశారు. మేం ఏం చేసినా చట్టం ప్రకారమే చేశామని పేర్కొన్నారు.

కాళేశ్వరం, మిషన్ భగీరథ పెద్ద స్కాం అని... కల్వకుంట్ల ఫ్యామిలీ లక్షలాది కోట్లు దోచుకుందని మండిపడ్డారు. మరీ కల్వకుంట్ల కుటుంబంపై ఐటీ రైయిడ్స్ ఏవని నిలదీశారు. అవినీతిపై ప్రశ్నించే కేంద్రం చర్యలు ఎందుకు తీసుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

కాళేశ్వరం అవినీతిపై అమిత్ షావి మాటలే చేతలేవని వివేక్ వెంకటస్వామి ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రతోనే నాపై ఐటీ దాడులు జరిగాయని ఆరోపించారు. కాంగ్రెస్ గెలుస్తుందనే మా నేతలపై ఐటీ రైయిడ్స్ చేశారని అన్నారు. చెన్నూరు ప్రజలు, కార్యకర్తలకు రుణపడి ఉంటానని చెప్పారు. వివేక్ తప్పు చేయరని పెద్దపల్లి ప్రజలకు తెలుసని వివరించారు.