100 కేసులున్న బాల్కసుమన్ కు .. వెయ్యి కోట్లెక్కడివి.?: వివేక్ వెంకటస్వామి

100 కేసులున్న బాల్కసుమన్ కు .. వెయ్యి కోట్లెక్కడివి.?: వివేక్ వెంకటస్వామి

చెన్నూరు సంపదను బీఆర్ఎస్ నేతలు కొల్లగొడుతున్నారని  కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతిలో మునిగిపోయిందన్నారు. చెన్నూరు నియోజకవర్గంలోని మందమర్రి, రామకృష్ణపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన..  బాల్కసుమన్ వెయ్యికోట్ల ఆస్తి సంపాదించారని ఆరోపించారు. వంద కేసులున్న వ్యక్తికి ఇపుడు వెయ్యికోట్లు ఎక్కడినుంచి వచ్చాయని ప్రశ్నించారు. బాల్కసుమన్ కు ప్రజల కష్టాలు పట్టవన్నారు.  చెన్నూరు నుంచి రోజుకు వందలాది లారీల ఇసుక తరలిస్తున్నారని విమర్శించారు.

కల్వకుంట్ల కమిషన్ రావు ప్రతి పనిలో 30 శాతం కమీషన్ తీసుకుంటారని ఆరోపించారు  వివేక్ వెంకటస్వామి. నెంబర్ వన్ భ్రష్టాచార్  ముఖ్యమంత్రి కేసీఆర్ అని విమర్శించారు. సింగరేణి లో లక్ష క్వాటర్స్ కాంగ్రెస్ హయాంలో  కట్టించినవేనని చెప్పారు.  తెలంగాణలో కాంగ్రెస్ హవా నడుస్తుందన్నారు   ప్రజలకు అందుబాటులో లేని ఎమ్మెల్యే ఎవరైనా ఉన్నారంటే అది బాల్కసుమనే అని విమర్శించారు.  ఇసుక దందాతో సంపాదించిన డబ్బుతో ఓట్లు కొనాలని చూస్తున్నారని ఆరోపించారు.