రేవంత్ రెడ్డిని కలిసిన వివేక్ వెంకటస్వామి

రేవంత్ రెడ్డిని కలిసిన వివేక్ వెంకటస్వామి

మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ తెలంగాణలో కాంగ్రెస్ కే పట్టం కట్టడంతో టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇంటికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా తరలివస్తున్నారు.  డిసెంబర్ 1 ఉదయం నుంచే రేవంత్ ఇంటి దగ్గర సందడి నెలకొంది. 

ఇవాళ  జూబ్లీహిల్స్ లోని రేవంత్ నివాసంలో చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి , సినీ నటుడు బండ్ల గణేష్, మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి  భేటీ అయ్యారు.   కాసేపట్లో రేవంత్,వివేక్ వెంకటస్వామి  సీఈవో వికాస్ రాజ్  ను కలవడానికి వెళ్లనున్నారు. అసైన్డు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు, రైతుబంధు నిధులు మళ్లించే కుట్రపై ఫిర్యాదు చేయనున్నారు. 

డిసెంబర్ 1న  పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మంత్రి చంద్రశేఖర్, మల్​రెడ్డి రంగారెడ్డి, బండి రమేశ్, చిన్నారెడ్డి, మహేశ్ కుమార్ గౌడ్, మల్లు రవి తదితరులు రేవంత్​ను కలిశారు. పోలింగ్ ట్రెండ్​పై వారితో రేవంత్ చర్చలు జరిపారు. నియోజకవర్గాల వారీగా జరిగిన పోలింగ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు. కొన్ని నియోజకవర్గాల్లో తక్కువ పోలింగ్ నమోదవడానికి గల కారణాలపై రేవంత్ ఆరా తీసినట్టు తెలిసింది. తక్కువ పోలింగ్ జరిగిన చోట్ల కాంగ్రెస్ అభ్యర్థుల పరిస్థితేంటన్నదానిపై చర్చ జరిగినట్టు తెలిసింది.