తరుణ్ చుగ్ తో వివేక్ వెంకటస్వామి భేటీ

తరుణ్ చుగ్ తో వివేక్ వెంకటస్వామి భేటీ

ఢిల్లీలో బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ తరుణ్ చుగ్ తో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి భేటీ అయ్యారు. ఈ మధ్య జరిగిన ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమంపై ఆయనతో చర్చించారు. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ప్రజా గోస- బీజేపీ భరోసా కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బైక్ ర్యాలీ సందర్భంగా బీజేపీ, TRS కార్యకర్తల మధ్య జరిగిన ఘర్షణ తదనంతరం జరిగిన పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.

ప్రస్తుతం తెలంగాణలో  నెలకొన్న తాజా రాజకీయ అంశాలపై  తరుణ్ చుగ్ తో వివేక్ వెంకటస్వామి చర్చించారు. బూత్ స్థాయిలో బీజేపీని బలోపేతం చేయడం, కేంద్ర పథకాలపై, కేసీఆర్ నెరవేర్చని హామీలపై ప్రజలకు వివరించడమే లక్ష్యంగా పార్టీ ఈ కార్యక్రమం చేపట్టింది. పల్లెల్లో బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తోంది. 6 నియోజకవర్గాల్లో, ఈ నెల 23 నుంచి ఆగస్టు 1 దాకా రెండో విడతలో మరో 7 నియోజకవర్గాల్లో ర్యాలీలు నిర్వహించనుంది.