కరోనాపై తప్పుడు లెక్కలు చెప్తూ..  కేంద్రంపై నిందలు వేస్తారా?

కరోనాపై తప్పుడు లెక్కలు చెప్తూ..  కేంద్రంపై నిందలు వేస్తారా?

హైదరాబాద్‌‌‌‌, వెలుగు: కరోనా కేసులు, మరణాల  విషయంలో  కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర సర్కార్ సరైన నివేదికలు ఇవ్వడం లేదని మాజీ ఎంపీ, బీజేపీ కోర్ కమిటీ మెంబర్ వివేక్  వెంకటస్వామి ఆరోపించారు. కరెక్టు రిపోర్టులు ఇవ్వకుండానే రాష్ట్రానికి ఆక్సిజన్, మందుల కోటా తక్కువగా వస్తోందంటూ కేంద్రంపై నిందలు వేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర సర్కార్ సరైన లెక్కలతో ముందుకు వస్తే కేంద్రంతో మాట్లాడి అవసరమైన సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఈ మేరకు శనివారం ఆయన వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘రాష్ట్రం కష్ట కాలంలో ఉంది. ఎక్కువ నిధులు, ఆక్సిజన్‌‌‌‌, రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు కావాలి” అని కేంద్రాన్ని రాష్ట్ర సర్కార్ అడగడం లేదని వివేక్ మండిపడ్డారు. ఇవేవీ అడగకుండానే, కేంద్రమే ఇస్తలేదని నిందలు వేస్తోందని ఫైర్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కరోనా కేసులు, మరణాలను తక్కువ చేసి చూపుతోందని ఆరోపించారు. కరోనా కట్టడికి కేంద్రం పకడ్బందీ చర్యలు తీసుకుంటోందని వివేక్ తెలిపారు. ఆక్సిజన్‌‌‌‌ కొరత రాకుండా చర్యలు చేపట్టిందని, ఆర్మీ విమానాల ద్వారా ఆక్సిజన్ ట్యాంకర్లను రాష్ట్రాలకు తరలిస్తోందని చెప్పారు. వ్యాక్సినేషన్‌‌‌‌, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల కొరతపై వెంటనే స్పందించినందుకు ప్రధాని మోడీకి ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. 

టిమ్స్ లో సౌకర్యాల్లేవ్.. 

టిమ్స్‌‌‌‌ను సూపర్‌‌‌‌ స్పెషాలిటీ హాస్పిటల్‌‌‌‌ చేస్తామని రాష్ట్ర సర్కార్ గొప్పలు చెప్పిందని.. కానీ అక్కడ కనీస సౌకర్యాలు కూడా లేవని వివేక్ విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆక్సిజన్‌‌‌‌, బెడ్లు, డాక్టర్ల కొరత ఏర్పడిందని  అన్నారు. రాష్ట్రంలో ఆయుష్మాన్‌‌‌‌ భారత్‌‌‌‌ను అమలు చేస్తే పేదలకు ఉచితంగా కరోనా ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ అందే అవకాశమున్నా.. మన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. సెక్రటేరియట్‌‌‌‌ను ఐసోలేషన్‌‌‌‌ సెంటర్‌‌‌‌ చేసే అవకాశమున్నా పట్టించుకోకుండా దాన్ని కూల్చేసి ప్రజలకు బెడ్ల కొరత సృష్టించిందని ఫైర్ అయ్యారు. డిజాస్టర్‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో కేంద్రం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం సరిగా ఉపయోగించుకోకుండా కేంద్రంపై నిందలు వేస్తోందన్నారు.