ఏడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలే

ఏడేళ్లలో ఒక్క నోటిఫికేషన్ రాలే

కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఇప్పటి వరకు ఒక్క నోటిఫికేషన్ రాలేదన్నారు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి . కానీ కౌన్సిల్ ఎన్నికలు, హుజురాబాద్,హుజుర్ నగర్ ఎన్నికలప్పుడు 50 వేల ఉద్యోగాలిస్తామని చెప్పినా ఇంత వరకు ఇవ్వలేదన్నారు. ఎన్నికలప్పుడు ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తామని అబద్ధాలు చెబుతున్నారన్నారు. ఖాళీగా ఉన్నలక్షా 90 వేల ఉద్యోగాలను భర్తీ చేయాలని బీజేపీ డిమాండ్ చేస్తుందన్నారు. నిజాం షుగర్ ఫ్యాక్టరీని రీ ఒపెన్ చేసి ఐదు వేల ఉద్యోగాలిప్పిస్తామని ఎన్నికల మేనిఫేస్టోలో పెట్టినా టీఆర్ఎస్ హామీ నెరవేర్చలేదన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు   ఉద్యోగాలేమో కల్వకుంట్ల కుటుంబానికి.. నిధులేమో కాంట్రాక్టర్  మెఘా కృష్ణారెడ్డికి ఇస్తున్నారన్నారు.  తెలంగాణలో కాంట్రాక్టర్లు ఉన్నా ఆంధ్రా కాంట్రాక్టర్లు ప్రోత్సహిస్తున్నారన్నారు.