ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి

ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలి

పెద్దపల్లి, వెలుగు: రాష్ట్రంలోని ప్రజలంతా సుఖ శాంతులతో ఉండాలని ఎల్లమ్మ, పోచమ్మ తల్లులను వేడుకున్నట్లు బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ డాక్టర్​ వివేక్ ​వెంకటస్వామి చెప్పారు. పెద్దపల్లి జిల్లాలో బుధవారం వివేక్ ​పర్యటించారు. ఈ సందర్భంగా జనగామలో జరుగుతన్న పోచమ్మ బోనాల్లో పాల్గొని పూజలు  చేశారు. సుల్తానాబాద్​లో గౌడ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రేణుక ఎల్లమ్మ తల్లి బోనాల్లో కూడా పూజలు చేసి ఆలయ అభివృద్ధికి రూ. 50 వేలు ఇచ్చారు. ఆయా కార్యక్రమాల్లో బీజేపీ లీడర్లు సాధుల రాంబాబు, మల్లికార్జున్, ​సునీల్​కుమార్, విజయ్​, సజ్జద్​, కాడే సూర్యనారాయణ, ఎలిగేడు శ్రీనివాస్​, పవన్​, ఏగోలపు సదయ్య, నాగరాజు, శ్యాం, వెంకటేశ్ ​పాల్గొన్నారు.