టీ4 అల్ట్రా 5జీ ఫోన్ను లాంచ్ చేసిన వివో...

టీ4 అల్ట్రా 5జీ ఫోన్ను లాంచ్ చేసిన వివో...

గ్లోబల్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయిన వివో ఇండియా మార్కెట్లో టీ4 అల్ట్రా 5జీ ఫోన్​ను లాంచ్​చేసింది. ఇందులో 6.67 ఇంచుల స్క్రీన్​, మీడియాటెక్​ డైమెన్సిటీ 9300 ప్లస్ ​ప్రాసెసర్​, వెనుక ట్రిపుల్​ కెమెరా సెటప్​, 32 ఎంపీ సెల్ఫీ కెమెరా, 5,500 ఎంఏహెచ్​ బ్యాటరీ, 90 వాట్ల ఫాస్ట్​ చార్జింగ్​, అండ్రాయిడ్​15 ఆధారిత ఫన్​టచ్​ ఓఎస్ ​వంటి ప్రత్యేకతలు ఉంటాయి. 

వివో టీ4 అల్ట్రా 5జీ ధర 8 జీబీ+256జీబీ  వేరియంట్ ధర రూ. 37,999 కాగా, 12జీబీ+256జీబీ వేరియంట్ ధర రూ. 39,999. హైఎండ్​ మోడల్​12 జీబీ+512జీబీ వేరియంట్ ధర రూ. 41,999 ఉంటుంది. ఈ నెల 18 నుంచి అమ్మకాలు మొదలవుతాయి.