50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వివో ఎక్స్200 ఎఫ్ఈ

50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాతో వివో ఎక్స్200 ఎఫ్ఈ
  • 50మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
  • మీడియాటెక్  డైమెన్సిటీ 9300 ప్లస్​ ప్రాసెసర్‌
  • 6,500 ఎంఏహెచ్ ​బ్యాటరీ
  • 12జీబీ ర్యామ్ + 256జీబీ,16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ 
  • జూలైనెల 23 నుంచి అమ్మకాలు ప్రారంభం 

వివో భారతదేశంలో తమ కొత్త స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఫోన్ ఎక్స్​200 ఎఫ్​ఈని విడుదల చేసింది.  ఇందులో మీడియాటెక్  డైమెన్సిటీ 9300 ప్లస్​ ప్రాసెసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 6.31-అంగుళాల డిస్​ప్లే, వెనుకవైపు 50ఎంపీ ప్రైమరీ , 50ఎంపీ పెరిస్కోప్ టెలిఫోటో, 8ఎంపీ అల్ట్రా-వైడ్ లెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌  కెమెరాలు, 50ఎంపీ సెల్ఫీ కెమెరా,  6,500 ఎంఏహెచ్ ​బ్యాటరీ, 90 వాట్ల ఫ్లాష్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఛార్జ్ వంటి ప్రత్యేకతలు ఉంటాయి.  12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.54,999 కాగా, 16జీబీ ర్యామ్ + 512జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.59,999. ఈ నెల 23 నుంచి అమ్మకాలు మొదలవుతాయి. 

వివో ఎక్స్200 ఎఫ్ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో విడుదలైంది. శక్తివంతమైన స్మార్ట్‌ఫోన్. ఇది ఫ్లాగ్‌షిప్-స్థాయి ఫీచర్లను ప్రీమియం డిజైన్‌తో వస్తోంది. సెల్ఫీ కెమెరాఈ ఫోన్ హైలైట్లలో ఒకటి. దీనికి 50 మెగాపిక్సెల్ ఆటోఫోకస్ (AF) సెల్ఫీ కెమెరా ఉంది. ఇది అధిక-నాణ్యత గల సెల్ఫీలు , వీడియో కాల్స్ కోసం అద్భుతంగా పనిచేస్తుంది.

ఈ హ్యాండ్ సెట్ మీడియాటెక్ డైమెన్సిటీ 9300+ (MediaTek Dimensity 9300+) ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇది శక్తివంతమైన పనితీరును , స్మూత్ మల్టీటాస్కింగ్‌ను అందిస్తుంది.

ALSO READ : తాకట్టుతో రుణమిస్తే..వాహనంపై యాజమాన్య హక్కులుండవు : హైకోర్టు

డిస్ ప్లే విషయానికి వస్తే.. 6.31 అంగుళాల 1.5K (1216x2640 పిక్సెల్స్) AMOLED డిస్ ప్లే తో వస్తుంది. వస్తుంది.120Hz రిఫ్రెష్ రేట్ తో స్మూత్ విజువల్స్ అందిస్తుంది. పీక్ బ్రైట్‌నెస్ 5000 నిట్స్ వరకు ఉంటుంది, ఇది పగటిపూట కూడా స్క్రీన్‌ను స్పష్టంగా చూడటానికి సహాయపడుతుంది. కంటి రక్షణ కోసం 4320Hz PWM డిమ్మింగ్ ఫీచర్ ఉంది.

RAM & స్టోరేజ్ విషయానికి వస్తే ..12GB RAM + 256GB స్టోరేజ్ వేరియంట్, 16GB RAM + 512GB స్టోరేజ్ వేరియంట్ వంటి రెండు  వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ స్మార్ ఫోన్ లో LPDDR5X RAM ,UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ ను ఉపయోగిస్తుంది. ఇవి ఫాస్ట్ డేటా యాక్సెస్ ,అప్లికేషన్ లోడింగ్‌ను అందిస్తాయి. మెమొరీ కార్డ్ స్లాట్ లేదు.

రేర్ కెమెరా: ఈ స్మార్ట్ ఫోన్ లో 50MP సోనీ IMX921 ప్రైమరీ సెన్సార్ (OIS), 50MP సోనీ IMX882 పెరిస్కోప్ టెలిఫోటో షూటర్ (OIS), 3x ఆప్టికల్ జూమ్ , 100x డిజిటల్ జూమ్ సపోర్ట్ తో ZEISS ఆప్టిక్స్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది.

బ్యాటరీ విషయాంలో బెస్ట్ వన్.. అతిపెద్ద బ్యాటరీతో వస్తుంది. 6500mAh బ్యాటరీతో వస్తుంది. ఇది కాంపాక్ట్ ఫోన్లలో అతిపెద్ద బ్యాటరీలలో ఒకటి. 90W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా తక్కువ సమయంలో ఫోన్‌ను పూర్తిగా ఛార్జ్ అవుతుంది. 

డిజైన్ & నిర్మాణం: IP68 ,IP69 రేటింగ్‌లతో డస్ట్ , వాటర్ రెసిస్టెన్స్ ను కలిగి ఉంది. -20°C వరకు తక్కువ ఉష్ణోగ్రతలకు కూడా పనిచేస్తుంది. ఈస్మార్ట్ ఫోన్ ఆకట్టుకునే రంగులతో అందుబాటులో ఉంది. ఆంబర్ ఎల్లో, లక్స్ గ్రే, ఫ్రాస్ట్ బ్లూ రంగులలో లభిస్తుంది.

ఆపరేటింగ్ సిస్టమ్: ఆండ్రాయిడ్ 15 ఆధారిత Funtouch OS తో పనిచేస్తుంది. కనెక్టివిటీ విషయంలో లేటెస్ట్ ఆప్షన్లతో వస్తుంది. 5G, 4G VoLTE, Wi-Fi 7, Bluetooth 5.4, NFC, USB Type-C, OTG, IR బ్లాస్టర్‌తో వస్తుంది. సెక్యూరిటీ పరంగా చూస్తే ఇన్ డిస్ ప్లే ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ను కలిగి ఉంది.