విశాఖ ఆర్కే బీచ్ చిల్డ్రన్ పార్కులో కుంగిన భూమి

విశాఖ ఆర్కే బీచ్ చిల్డ్రన్ పార్కులో కుంగిన భూమి

జావెద్ తుఫాన్ ఎఫెక్ట్ తో విశాఖలో సాగరతీరం అల్లకల్లోలంగా మారింది. బీచ్ వెంబడి భూమి కోతకు గురైంది. ఆర్కే బీచ్ లో దాదాపు 200 మీటర్ల వరకు భూమి కోతకు గురైంది. ఆర్కే బీచ్ వద్ద ఉన్న చిల్డ్రన్ పార్కులో భూమి కుంగింది. చిల్డ్రన్ పార్కులో ఓ అడుగు మేర భూమి కుంగిపోయింది. పార్కులో బల్లలు విరిగిపోయాయి. ప్రహారీ గోడ కూడా విరిగిపోయింది. దీంతో పార్కుకు వచ్చే రహదారుల్ని అధికారులు మూసివేశారు. ఎవరిని లోపలికి అనుమతించడం లేదు. ఆర్కే బీచ్ వద్ద రాకపోకలపై నిషేధం విధించారు. విశాఖలోని నోవాటెల్‌ హోటల్‌ ముందుభాగంలో బారికేడ్లు పెట్టారు. జవాద్‌ తుపాను నేపథ్యంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతోనే సముద్రం ముందుకొచ్చి ఉంటుందని భావిస్తున్నారు. పర్యాటకులకు అనుమతి నిరాకరించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా బీచ్ వద్ద పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు.