ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్‌‌పై పుతిన్ దాడి చేస్తడు

ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్‌‌పై  పుతిన్ దాడి చేస్తడు

వాషింగ్టన్​: ఉక్రెయిన్‌‌ రాజధాని కీవ్‌‌పై దాడి చేయాలని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నిర్ణయించుకున్నారని అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ శుక్రవారం రాత్రి (అమెరికా టైం ప్రకారం) వెల్లడించారు. ‘‘పుతిన్ దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు నేను నమ్ముతున్నా. అలా నమ్మడానికి మాకు కొన్ని కారణాలున్నాయి. రానున్న రోజుల్లోనే అటాక్ జరిగే అవకాశం ఉంది” అని చెప్పారు. రష్యా దాడి చేస్తే.. ఎకనామిక్, డిప్లమాటిక్ ఆంక్షలతో విరుచుకుపడుతామని హెచ్చరించారు. అందుకు పుతిన్ మరోసారి ఆలోచించుకోవాలని హితవుపలికారు. యుద్ధమే జరిగితే మహా విపత్తు లాంటి, అవసరం లేని యుద్ధాన్ని ఎంచుకున్నందుకు బాధ్యత వహించాల్సి ఉంటుందని రష్యాను హెచ్చరించారు. ఉక్రెయిన్‌‌లో పోరాడేందుకు తమ బలగాలను పంపబోమని, కానీ ఉక్రెయిన్ ప్రజలకు సపోర్ట్ చేయడం ఆపబోమని స్పష్టంచేశారు. రష్యా దళాల్లో 40% నుంచి 50% దాకా ఉక్రెయిన్‌‌ బార్డర్‌‌‌‌కు దగ్గర్లోకి వెళ్లాయని అమెరికా డిఫెన్స్ ఆఫీసర్లు చెప్పారు. ఈ తరలింపు వారం రోజులుగా జరుగుతున్నట్లు తెలిపారు. బెటాలియన్ టాక్టికల్ గ్రూపులుగా పిలిచే రష్యన్ గ్రౌండ్ యూనిట్ల సంఖ్య 83 నుంచి 125కి పెంచారు. ఒక్కో యూనిట్‌‌లో 750 నుంచి వెయ్యి మంది సైనికులు ఉంటారు.

For More News..

ప్రభాస్తో నటించడం నాకు దక్కిన గౌరవం

పార్టీ నన్ను వదిలించుకుంటేనే మంచిది: జగ్గారెడ్డి