రూ. 2 వేల 400 కోట్ల బకాయిలను చెల్లించనున్న వీఐ

రూ. 2 వేల 400 కోట్ల బకాయిలను చెల్లించనున్న వీఐ

న్యూఢిల్లీ:  టెలికాం ఆపరేటర్ వొడాఫోన్ ఐడియా సెప్టెంబర్ నాటికి ప్రభుత్వానికి సుమారు రూ. 2,400 కోట్ల బకాయిలను చెల్లించాలని యోచిస్తోంది.  2022–-23 మార్చి క్వార్టర్​కు సంబంధించి దాదాపు రూ. 450 కోట్ల లైసెన్స్ ఫీజులు,  స్పెక్ట్రమ్ వినియోగ ఛార్జీల పెండింగ్ బకాయిలను కంపెనీ ఇటీవలే కట్టింది. ఈ కంపెనీ ప్రస్తుత సంవత్సరం జులై నాటికి దాదాపు రూ. 770 కోట్ల లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి వచ్చింది.  

గతేడాది నిర్వహించిన వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌‌‌‌కు మొదటి విడతగా రూ. 1,680 కోట్లు కట్టింది. స్పెక్ట్రమ్ బకాయిలను కట్టడానికి కంపెనీ 30 రోజుల గడువు కోరింది. సెప్టెంబర్‌‌‌‌లోపే లైసెన్స్ ఫీజునూ చెల్లించడానికి కంపెనీ రెడీ అవుతోంది. స్పెక్ట్రమ్ వాయిదా చెల్లింపు ఆలస్యమైతే ఏటా 15 శాతం వడ్డీ కట్టాలి. కంపెనీ స్పెక్ట్రమ్ ఇన్‌‌‌‌స్టాల్‌‌‌‌మెంట్ కోసం దాదాపు రూ. 1,700 కోట్లు,  లైసెన్స్ ఫీజు బకాయిల కోసం దాదాపు రూ. 710 కోట్లను వడ్డీతో సహా చెల్లించాల్సి ఉంటుంది..