
న్యూఢిల్లీ: శాటిలైట్ కమ్యూనికేషన్ సర్వీసులోకి వొడాఫోన్ ఐడియా (వీ) కూడా ఎంట్రీ ఇవ్వనుంది. స్పేస్ఎక్స్ ప్రత్యర్థి కంపెనీ ఏఎస్టీ స్పేస్‌మొబైల్‌తో పార్టనర్షిప్ కుదుర్చుకుంది. శాటిలైట్ సర్వీస్ అందించడంలో ఈ రెండు కంపెనీలు కలిసి పనిచేస్తాయి.
ఏఎస్టీ స్పేస్‌మొబైల్ శాటిలైట్ ఆధారంగా సెల్యులార్ బ్రాడ్‌బ్యాండ్ నెట్వర్క్ని డెవలప్ చేస్తోందని వీ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. ఈ నెట్‌వర్క్‌ను స్మార్ట్ఫోన్ల ద్వారా నేరుగా యాక్సెస్ చేసుకోవచ్చని, వాణిజ్య, ప్రభుత్వ యాప్‌ల కోసం వాడొచ్చని వివరించింది.
ఏఎస్టీ సాధారణ మొబైల్ ఫోన్ ఉపయోగించి స్పేస్ నుంచి మొదటి వాయిస్, వీడియో కాల్ చేసి చరిత్ర సృష్టించింది.