జూలై 5, 6న వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’..ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ల సదస్సు

జూలై 5, 6న వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’..ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ల సదస్సు
  • హాజరుకానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్, సీఎం రేవంత్

హైదరాబాద్, వెలుగు: బాలలను లైంగిక నేరాల నుంచి రక్షించడం, వారి హక్కులు -‘వాయిస్  ఫర్  ది వాయిస్ లెస్’ అనే అంశంపై శని, ఆదివారాల్లో  రెండు రోజులపాటు రాష్ట్ర స్థాయి స్టేక్‌‌‌‌ హోల్డర్ల సదస్సు జరగనుంది. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రారంభోత్సవ సదస్సుకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్  సూర్యకాంత్  ముఖ్య అతిథిగా హాజరవుతారు. 

సీఎం రేవంత్ రెడ్డి, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, డీజీపీ జితేందర్, మహిళాశిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, యూనిసెఫ్  చీఫ్  ఫీల్డ్  ఆఫీసర్  డాక్టర్  జలాలెం టిఫెన్స్, రాష్ట్ర లీగల్  సర్వీసెస్  అథారిటీ కార్యదర్శి పంచాక్షరీ కూడా ఈ సదస్సుకు హాజరుకానున్నారు. ఈ రెండు రోజుల సదస్సులో వివిధ అంశాలపై జరిగే చర్చల్లో పలువురు ప్రముఖులు పాల్గొంటారు.