వెండితెరపై తనదైన నటనతో మెప్పించే సౌత్ క్వీన్ జ్యోతిక, బాలీవుడ్ భామ సోనాక్షీ సిన్హా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ వెబ్ సిరీస్ ‘సిస్టమ్’ (System). టాలెంటెడ్ డైరెక్టర్ అశ్వినీ అయ్యర్ తివారీ అద్భుతమైన విజన్‌తో తెరకెక్కించిన ఈ క్రైమ్ అండ్ కోర్ట్ డ్రామా నేరుగా ఓటీటీలోనే ల్యాండ్ అవుతోంది. ప్రముఖ ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ వీడియో’లో మే 22 నుంచి ఈ సినిమా తెలుగుతో పాటు మిగిలిన భాషల్లోనూ స్ట్రీమింగ్ కానుంది. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ నెట్టింట సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది.
అసలు కథేంటంటే?
"ధనవంతుల అరుపుల మధ్య పేదవాడి గొంతు మూగబోతోంది" అనే పవర్‌ఫుల్ పాయింట్‌తో ఈ సిరీస్ తెరకెక్కింది. ట్రైలర్ చూస్తుంటే సమాజంలోని రెండు వేర్వేరు ధృవాలకు చెందిన మహిళలు న్యాయం కోసం ఏకమైతే ఎలా ఉంటుందనేదే ఈ చిత్ర ప్రధానాంశం. తన తండ్రి (అశుతోష్ గోవారికర్) లా ఫర్మ్‌లో తనని తాను నిరూపించుకోవాలని తపించే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ‘నేహా రాజవంశ్’ పాత్రలో సోనాక్షీ సిన్హా అదరగొట్టింది. అధికారం, డబ్బు, వ్యక్తిగత ఆశయాల మధ్య నలిగిపోయే ఓ ఛాలెంజింగ్ కేస్‌ను ఆమె ఎలా డీల్ చేసిందనేది ఆసక్తికరం.
మరోవైపు సామాన్య జీవితం గడిపే ఓ షార్ప్ అండ్ రిసోర్స్‌ఫుల్ కోర్ట్ స్టెనోగ్రాఫర్ ‘సారిక’ పాత్రలో జ్యోతిక నటించింది. నేహాకు తోడుగా నిలిచి, తనదైన శైలిలో న్యాయం కోసం పోరాడే పాత్రలో జ్యోతిక స్క్రీన్ ప్రెజెన్స్ మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. అన్యాయంపై ఆశయం సాధించిన విజయమే ఈ ‘సిస్టమ్’. లేటెస్ట్ గా రిలీజ్ చేసిన ఈ ట్రైలర్ సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటుంది.
భారీ అంచనాలతో..
జ్యోతిక - సోనాక్షీ సిన్హా లాంటి ఇద్దరు పవర్‌హౌస్ పర్‌ఫార్మర్స్ స్క్రీన్‌ను షేర్ చేసుకోవడం ఈ వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచేసింది. విభిన్నమైన కథాంశాలను తెరకెక్కించడంలో దిట్ట అయిన అశ్వినీ అయ్యర్ తివారీ మార్క్ మేకింగ్ ట్రైలర్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. హర్మాన్ బవేజా, అరుణ్ సుకుమార్, అక్షత్ ఘిల్డియాల్ వంటి టాప్ రైటర్స్ దీనికి స్క్రీన్‌ప్లే అందించారు.
నెట్టింట భారీ రెస్పాన్స్
ట్రైలర్ చూసిన ప్రేక్షకులు సామాజిక మాధ్యమాల్లో క్రేజీ కామెంట్స్ పెడుతున్నారు. జ్యోతిక గారు స్క్రీన్‌పైకి వస్తే అదో గోల్డెన్ హిస్టరీ. అంతే కాదుఅశుతోష్ గోవారికర్ లాంటి దర్శకుడే నటుడిగా మారారంటే ఇది ఖచ్చితంగా మాస్టర్‌పీస్ అవుతుంది, ఇది సోనాక్షీ సిన్హా ఎరా అంటూ ఫ్యాన్స్ రచ్చ చేస్తున్నారు. మే 22న స్ట్రీమింగ్ కానున్న ఈ వెబ్ సిరీస్.. ఓటీటీ ప్రియులకు ఒక సరికొత్త, నరాలు తెగే క్రైమ్ డ్రామా అనుభూతిని ఇవ్వడం ఖాయమనిపిస్తోంది. సిస్టమ్‌ను మార్చడానికి వస్తున్న ఈ ఇద్దరు భామల వేట ఎలా ఉంటుందో చూడాలి.
