సీఎం పై వాట్సాప్ లో అనుచిత వ్యాఖ్యలు.. గ్రామ వాలంటీర్ అరెస్ట్

సీఎం పై వాట్సాప్ లో అనుచిత వ్యాఖ్యలు.. గ్రామ వాలంటీర్ అరెస్ట్

కర్నూలు: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పై సోషల్ మీడియాలో అనుచితంగా పోస్ట్ లు పెట్టిన వ్యక్తిని  కర్నూల్ జిల్లా మిడుతూరు మండల పోలీసులు అరెస్ట్ చేశారు . మిడుతూరు మండల కేంద్రంలో పని చేస్తున్న హరిప్రసాద్ అనే గ్రామ వాలంటీర్ పై ఐ.టి యాక్ట్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. వాట్సాప్ గ్రూపులో సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచితంగా పోస్ట్ లు చేసినందుకు గానూ.. అతన్ని అదుపులోకి విచారణ జరుపుతున్నారు.

మూడు రోజుల క్రితం ఏపీ అసెంబ్లీలో దిశ ఎన్ కౌంటర్ పై చర్చ జరిగింది. ఈ చర్చలో సీఎం జగన్.. దిశ ఘటనను ప్రస్తావిస్తూ.. తనకు ఒక్కతే భార్య అనే వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఓ పవన్ కళ్యాణ్ అభిమాని వాట్సాప్ లో అభ్యంతర కర పోస్టులు చేశాడు. ముఖ్యమంత్రి కుటుంబసభ్యులైన భార్య, చెల్లెలు, బాబాయి, తాత లను కూడా కించపరస్తూ కామెంట్లు చేశాడు. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకొని అతడిని అదుపులోకి తీసుకున్నారు. ఆ వ్యక్తి మిడుతూరు గ్రామ వాలంటీర్ హరిప్రసాద్ అని తెలిసింది.