
స్వీడన్ ఆటోమొబైల్ కంపెనీ వోల్వో తమ కొత్త ఎంట్రీ-లెవల్ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ ఈఎక్స్30ని రూ.40 లక్షల ఎక్స్‌షోరూమ్ ధరతో మార్కెట్లోకి తీసుకొచ్చింది. దీంట్లో 69 కిలోవాట్ అవర్ బ్యాటరీని అమర్చారు. ఒక్కసారి చార్జ్ చేస్తే 480కి.మీ మైలేజ్ ఇస్తుంది. 272హెచ్‌పీ పవర్, 343ఎన్‌ఎం టార్క్ దీని సొంతం.
100 కిమీ స్పీడ్‌ను 5.3 సెకన్లలో అందుకోగలదు. - ఈఎక్స్30లో 12.3 ఇంచుల గూగుల్ ఇన్ఫోటైన్‌మెంట్, డ్యూయల్ జోన్ క్లైమేట్, పనోరమిక్ సన్‌రూఫ్, 1040 వాట్స్ హర్మన్ కార్డన్ సౌండ్, అడాస్ లెవెల్ 2 సేఫ్టీ ఫీచర్లు, 7 ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీ కెమెరా వంటి ప్రత్యేకతలు ఉన్నాయి.