నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది:అశ్వనీ శర్మ

నా వ్యాఖ్యలను కాంగ్రెస్ వక్రీకరించింది:అశ్వనీ శర్మ

పంజాబ్ లో అసెంబ్లీ ఎన్నికలకు ఒక్కరోజు ముందు ఆ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు అశ్వనీ శర్మ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.బీజేపీకి ఓటు వేయకపోతే కాంగ్రెస్ కు ఓటు వేయండి.కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమ్ ఆద్మీ పార్టీకి మాత్రం ఓటు వేయొద్దని ఎన్నికల ప్రచార ర్యాలీలో చేసిన వ్యాఖ్యలు పంజాబ్ లో సంచలనంగా మారాయి. ఆప్ కు ఓటు వేస్తే దేశానికి, పంజాబ్ కు ద్రోహం చేసినట్టే అవుతుందన్నారు. అందుకే దేశానికి ద్రోహం చేసేవారికి ఓటు వేయవద్దు అన్నారు అశ్వనీ శర్మ. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోపై వివరణ ఇచ్చారు అశ్వనీ శర్మ.తన వ్యాఖ్యలను కొందరు వక్రీకరించారని చెప్పారు. తాను అలా అనలేదన్నారు. అబద్ధాలను ప్రచారం చేయడంలో కాంగ్రెస్ ఎప్పుడూ ముందుంటుందన్నారు. రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకే కాంగ్రెస్ తన వ్యాఖ్యలను వక్రీకరించిందని మండిపడ్డారు. బీజేపీకి ఓటు వేయడంతోనే పంజాబ్ అభివృద్ధి చెందుతుందని ఆయన మరో వీడియోలో క్లారిఫికేషన్ ఇచ్చారు. 

మరిన్ని వార్తల కోసం

యూపీలో రేపు మూడో విడత పోలింగ్

కేంద్రమంత్రి నిర్మల సీతారామన్‌కు హరీశ్ రావు లేఖ