
- టీఎస్ఈసీ వెబ్సైట్ లో అందుబాటులో
- ఒక్క క్లిక్ తో తెలుసుకునే వెసులుబాటు
- కొనసాగుతున్న అభ్యంతరాల స్వీకరణ
- ఈనెల 28న తుది జాబితా
హైదరాబాద్, వెలుగు: మీ చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంటే ఓటరు జాబితా మీ చేతిలో ఉన్నట్టే. గూగుల్లో టీఎస్ఈసీ వెబ్సైట్లోకి వెళ్లి ఒక్క క్లిక్ చేస్తే చాలు మీ పేరు ఓటరు జాబితాలో ఉందో.. లేదో తెలుసుకోవచ్చు. పూర్తి ఓటరు జాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం టీఎస్ఈసీ వెబ్సైట్ https://tsec.gov.in లో పొందుపర్చింది. ఇందులోకి వెళ్లగానే టీఎస్ఈసీ వెబ్సైట్ఆప్షన్తోపాటు డ్రాఫ్ట్ రోల్ జీపీ/వార్డ్ వైజ్ ఓటర్ లిస్ట్ (గ్రామపంచాయతీ, వార్డులవారీగా) అనే మరో ఆప్షన్ కనిపిస్తుంది.
రెండో ఆప్షన్ ఎంచుకుని అక్కడ మీ జిల్లా, మండలం, గ్రామ పంచాయతీ వివరాలను నమోదు చేస్తే మీ గ్రామానికి సంబంధించిన ఓటరు జాబితా వార్డులవారీగా కనిపిస్తుంది. తెలుగు, ఇంగ్లిష్లో ఈ ఓటరు జాబితా ఉంటుంది. దీనిపై ఏమైనా అభ్యంతరాలుంటే ఈ నెల 21 వరకు స్వీకరిస్తారు. ఫైనల్గా ఈ నెల 28న తుది ఓటరు జాబితాను ప్రకటిస్తారు.