పల్లె పోరుకు కసరత్తు షురూ.. కొడంగల్లో బీఎల్ఓ, సూపర్వైజర్లకు ట్రైనింగ్

పల్లె పోరుకు కసరత్తు షురూ.. కొడంగల్లో బీఎల్ఓ, సూపర్వైజర్లకు ట్రైనింగ్
కొడంగల్, వెలుగు: రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో వికారాబాద్ జిల్లా అధికారులు పల్లె పోరుకు సమాయత్తమవుతున్నారు. గురువారం కొడంగల్​లోని జడ్పీ హై స్కూల్లో బీఎల్ఓ, సూపర్​వైజర్లకు ఎలక్షన్​ ట్రైనింగ్ ప్రారంభించారు. బీఎల్ఓలు క్షేత్రస్థాయిలో పరిశీలించాకే ఓటరు జాబితాలో మార్పు, చేర్పులు చేయాలని అడిషనల్ ​కలెక్టర్ ​లింగ్యా నాయక్​ఆదేశించారు.
 
18 ఏండ్లు నిండిన ప్రతిఒక్కరూ ఓటు నమోదు చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. జాబితాలో తప్పుగా నమోదైన పేర్లు, పాత ఫొటోలను సవరించాలన్నారు. కుటుంబ సభ్యులంతా ఒకే పోలింగ్​ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకునేలా జాబితాలో మార్పులు చేయాలని సూచించారు. తహసీల్దార్​విజయ్​కుమార్, ఎంఈఓ రాంరెడ్డి ఉన్నారు.