V6 News

బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ మింగిన ఓటరు.. ఓటు రద్దు చేసిన అధికారులు

బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌  మింగిన ఓటరు.. ఓటు రద్దు చేసిన అధికారులు

జగిత్యాల, వెలుగు : మద్యం మత్తులో పోలింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రానికి వచ్చిన ఓ వ్యక్తి ఓటేసిన అనంతరం బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ను మింగా డు. ఈ ఘటన జగిత్యా ల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్‌‌‌‌‌‌‌‌ గ్రామంలో గురువారం జరిగిం ది. గ్రామానికి చెందిన పిట్టల వెంకటి (70) గ్రామంలోని వార్డు నంబర్‌‌‌‌‌‌‌‌ 5 పోలింగ్‌‌‌‌‌‌‌‌ కేంద్రంలో ఓటు వేయడానికి మద్యం మత్తులో వచ్చాడు.

 ఆఫీసర్లు బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ పేపర్‌‌‌‌‌‌‌‌ ఇవ్వడంతో ఓటు వేసిన అనంతరం బ్యాలెట్‌‌‌‌‌‌‌‌ను బాక్స్‌‌‌‌‌‌‌‌లో వేయకుండా.. నోట్లో పెట్టుకొని నమిలి మింగేశాడు. గమనించిన పోలింగ్‌‌‌‌‌‌‌‌ సిబ్బంది వెంటనే ఉన్నతాధికారులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వెంకటిని అదుపులోకి తీసుకున్నారు. వెంకటి ఓటును రద్దు చేస్తున్నట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.