విద్యావిధానం మారాలి.. రోడ్లు వేయాలి.. : ఓట్లతో పాటు చీటీలు

విద్యావిధానం మారాలి.. రోడ్లు వేయాలి.. : ఓట్లతో పాటు చీటీలు

పల్లె ఓటరు మార్పు కావాలంటున్నాడు. బ్యాలెట్ తో పాటే.. తన వాయిస్ ను కూడా వినిపించాడు. ఇటీవల జరిగిన MPTC, ZPTC ఎన్నికల్లో బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతోపాటు.. తమ సందేశాన్ని కూడా ఓ చీటీలో రాసి బాక్సుల్లో వేశారు.

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో.. బ్యాలెట్ బాక్సుల్లో ఓట్లతో పాటు.. చీటీలు కనిపించాయి. రాయికల్ ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపులో ఓట్లతో పాటు.. కొన్ని లెటర్లు బయటపడ్డాయి.

ఇటిక్యాలకు చెందిన ఓ ఓటరు.. విద్యా విధానం మారాలని చీటీ వేశాడు. మూటపెళ్లిలో ఓ ఓటరు తమ గ్రామంలో ప్రధాన రోడ్డు సమస్యలను వివరిస్తూ.. వాటిని పరిష్కరించాలని కోరుతూ రాసిన లెటర్ ను ఓటుతో పాటు వేశాడు.

సీఎంకు బ్యాలెట్ బాక్స్ లో లెటర్

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని గర్రెపల్లి గ్రామాన్ని మండలంగా మార్చాలని బ్యాలెట్ లో ముఖ్యమంత్రికి లేఖ రాసిన గ్రామస్తులు.

ఈ లెటర్లను అధికారులు సంబంధిత అధికారులకు అప్పగించారు.