
వర్షానికి మహబూబ్ నగర్ జిల్లాలోని పలు కేంద్రాల్లో బ్యాలెట్ ఓట్లు తడిసిపోయాయి. చిన్నచింత కుంట MPTC 2 లోని 39 వ బూత్ బాక్స్, అమ్మాపూర్ ఎంపీటీసీ కి చెందిన 50 వ బూత్ బాక్స్ లో వర్షానికి బ్యాలెట్ బాక్స్ లు తడిసిపోయాయి. తడిసిన బ్యాలెట్ పత్రాలను ఆరబెట్టారు ఎన్నికల సిబ్బంది. కిటికీ పక్కనే బ్యాలెట్ బాక్స్‌లు పెట్టడంతో వర్షానికి బ్యాలెట్ పత్రాలు తడిసిపోయాయని చెప్పారు.