వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇంకెప్పుడిస్తారు..?

వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇంకెప్పుడిస్తారు..?
  • ములుగు ఎమ్మెల్యే సీతక్క

హైదరాబాద్: వీఆర్ఏలకు పే స్కేల్, ప్రమోషన్లు ఇవ్వాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క కోరారు. అసెంబ్లీ జీరో అవర్ లో వీఆర్ఏల సమస్యలపై సీతక్క మాట్లాడారు. వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సరైనా జీతాలు, ప్రమోషన్లు లేక వీఆర్ఏలు ఇబ్బందులు పడుతున్నారని ఆమె పేర్కొన్నారు. 
గ్రామ రెవెన్యూ వ్యవస్థకు వీఆర్ఏలు పునాదిలాంటి వారని ఆమె తెలిపారు. రాష్ట్రంలో 25 వేల మంది వరకు వీఆర్ఏలు ఉన్నారని, దాదాపు పదేళ్లుగా వాళ్లకు ఎటువంటి ప్రమోషన్లు, పే స్కేల్ అమలు గానీ, ఇతర బెనిఫిట్స్ గానీ అందజేయలేదని అన్నారు. 2020 సెప్టెంబర్ లో అసెంబ్లీలో రెవెన్యూ చట్ట సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సీఎం కేసీఆర్.. వీఆర్ఏల సమస్యల పరిష్కారంపై హామీ ఇచ్చారని, వాటిని నెరవేర్చాలని కోరారు. వారికి పే స్కేల్ అమలు కోసం జీవో వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. 

 

ఇవి కూడా చదవండి

చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం

కేసీఆర్కు ప్రజా సమస్యలు పట్టవు

అసెంబ్లీని టీఆర్ఎస్ సభ్యులు కౌరవసభలా మార్చిన్రు