చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం

చంద్రబాబును సీఎం చేయడమే పవన్ లక్ష్యం

అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శలకు దిగారు. పవన్ కమెడియన్ లాంటోడని.. ఆయనకు, నాగబాబుకు తమ గురించి మాట్లాడే నైతిక అర్హత లేదన్నారు. మధ్యాహ్నం మీటింగ్, సాయంత్రం ఫామ్ హౌస్ లో ఉండేవారికి రాజకీయాలు ఎందుకని ప్రశ్నించారు. పోటీ చేసిన రెండు చోట్లలోనూ పవన్ ను ప్రజలు చిత్తుగా ఓడించారని.. అయినా ఆయనకు  సిగ్గురాలేదన్నారు. వైసీపీ నాయకులను బెదిరిస్తే.. పవన్ ఏపీలో తిరగలేరని హెచ్చరించారు. 

‘జనసేన ఆవిర్భావ సభలో తాను ఎవరి కోసం పార్టీ పెట్టాడో పవన్ క్లారిటీ ఇచ్చారు. ప్రజా వ్యతిరేక ఓటు చీల్చనివ్వబోనని ఆయన స్పష్టంగా చెప్పారు. చంద్రబాబుతో కలసి పనిచేస్తానన్నారు. బీజేపీ రూట్ మ్యాప్ కోసం ఎదురు చూస్తున్నానని అన్నారు. చంద్రబాబును సీఎం చేయడమే పవన్ కు ఉన్న లక్ష్యం. పార్టీ పెట్టారు కాబట్టి తాను ముఖ్యమంత్రి అవ్వాలి, రాష్ట్రాన్ని పాలించాలని ఆయనకు లేదు. పవన్ బెదిరింపులకు ఎవరూ భయపడేది లేదు. రాజకీయాల్లో పవన్ ఊసరవెల్లి లాంటోడు. ఆయన మాటల్ని ప్రజలు విశ్వసించరు.  సీఎం జోలికొచ్చినా.. మా వైసీపీ జోలికొచ్చినా ఖబద్దార్’ అని వెల్లంపల్లి వార్నింగ్ ఇచ్చారు. జగన్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పవన్ కు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. కుల, మతాలకు అతీతంగా పాలనను సాగిస్తున్న జగన్ పై బురద చల్లితే ప్రజలు సహించబోరన్నారు. 

మరిన్ని వార్తల కోసం:

మన మిసైల్ వ్యవస్థ పూర్తిగా సేఫ్

ఐపీఎల్ నిబంధనల్లో కీలక మార్పులు 

రష్యాలో ఫైజర్ పెట్టుబడులు బంద్