
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: సీఎం కేసీఆర్ వీఆర్వోలను అవమానిస్తూ చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, తహసీల్దార్ కార్యాలయాల్లో క్యాడర్ స్ట్రెంత్‌కు నియామకాలు చేప్టటాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రంలోని అన్ని కలెక్టరేట్ల ఎదుట తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంక్షేమ సంఘం(టీవీఆర్వోడబ్ల్యూఏ) ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గరికె ఉపేందర్ రావు, ప్రధాన కార్యదర్శి హెచ్. సుధాకర్ రావు వెల్లడించారు. సమగ్ర భూసర్వే ద్వారా భూసమస్యలు పరిష్కరించాలని, ప్రతి మూడు వేల మందికి ఓ రెవెన్యూ క్లస్టర్‌ను ఏర్పాటు చేసి వీఆర్వోను నియమించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత, ఆత్మగౌరవం కోసం నిర్వహిస్తున్న ఈ ధర్నాలో వీఆర్వోలు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు.