
హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ పికిల్‌బాల్ అసోసియేషన్ (హెచ్‌పీఏ) పికిల్‌బాల్ టోర్నమెంట్‌లో వీఎస్ వైశాక్ విజేతగా నిలిచాడు. మాదాపూర్‌లోని ప్యాడిల్‌వేవ్ స్పోర్ట్స్ సెంటర్‌లో సోమవారం జరిగిన మెన్స్ సింగిల్స్ ఫైనల్లో వైశాక్ 11-–10, 6–-11, 11–-0తో అనుతేజ్‌ను ఓడించాడు. డబుల్స్ గిరీశ్– విజయ్ తేజ్ టైటిల్ నెగ్గింది. హెచ్‌పీఏ ప్రెసిడెంట్ దుద్దిళ్ల శ్రీనివాస్ బాబు విన్నర్లకు ట్రోఫీలు, ప్రైజ్‌మనీ అందజేశారు.