కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ పై సుప్రీం కీలక తీర్పు : ఒకటి కాదు.. ఐదింటిని లెక్కపెట్టాలి

కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ పై సుప్రీం కీలక తీర్పు : ఒకటి కాదు.. ఐదింటిని లెక్కపెట్టాలి

న్యూఢిల్లీ: వీవీప్యాట్‌‌‌‌‌‌‌‌ స్లిప్పుల కౌంటింగ్‌‌‌‌‌‌‌‌ విషయంలో సుప్రీంకోర్టు కీలక తీర్పు చెప్పింది. ప్రతి అసెంబ్లీ స్థానంలోని ఐదు వీవీప్యాట్ల స్లిప్పులను లెక్కించాలని కేంద్ర ఎన్ని కల కమిషన్‌‌‌‌‌‌‌‌ను ఆదేశించింది. లోక్‌‌‌‌‌‌‌‌సభ ఎన్నికల్లో ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లో 50శాతం వీవీప్యాట్‌‌‌‌‌‌‌‌ స్లిప్పులను లెక్కించాలని ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలో ప్రతిపక్ష నేతలు వేసిన పిటిషన్‌‌‌‌‌‌‌‌పై సుప్రీం కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యా యమూర్తి జస్టిస్‌‌‌‌‌‌‌‌ రంజన్‌‌‌‌‌‌‌‌ గొ గోయ్‌‌‌‌‌‌‌‌ నేతృత్వం లోని బెంచ్‌ ఈ మేరకు తీర్పును చెప్పింది. ఎన్నికల ప్రక్రియలో ఓటర్ల విశ్వాసాన్ని , విశ్వసనీయతను దృష్టిలో ఉంచుకుని ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని బెంచ్‌ చెప్పింది. 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాల్సిన అవసరం లేదన్న ఈసీ అభ్యర్థనను బెంచ్‌ తోసిపుచ్చింది. 50 శాతం వీవీప్యాట్‌‌‌‌‌‌‌‌ స్లిప్పులు లెక్కపెట్టాలంటే కనీసం ఆరు రోజులు పడుతుందని, రిజల్ట్స్‌ ఆరు రోజులు ఆలస్యం అయ్యే అవకాశం ఉందని చెప్పింది. దీనిపై స్పందించిన ప్రతిపక్ష పార్టీలు రిజల్ట్‌‌‌‌‌‌‌‌ ఆలస్యమైనా ఇబ్బంది లేదని సుప్రీం కోర్టుకు చెప్పాయి. లోక్‌‌‌‌‌‌‌‌సభ నియోజకవర్గాల్లో అయితే 35 వీవీప్యాట్లలోని స్లిప్పులను లెక్కపెట్టాలి.

తీర్పును వెంటనే అమలు చేస్తాం : ఈసీ

సుప్రీం కోర్టు తీర్పును వెంటనే అమలు చేస్తామని ఎలక్షన్‌‌‌‌‌‌‌‌ కమిషన్‌‌‌‌‌‌‌‌ చెప్పింది. “ సుప్రీం కోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేసేం దుకు ఈసీ అన్ని చర్యలు తీసుకుంటోంది” అని ఈసీ అధికార ప్రతినిధి మీడియాతో చెప్పారు. దీంతో గతంలో మొత్తం 4,125 ఈవీఎంలను లెక్కిం చాల్సి ఉండగా.. ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పుతో 20,625 ఈవీఎంల వీవీప్యాట్లు లెక్కించాల్సి ఉంటుంది.