Twitter లో "W" బ్యాగ్రౌండ్ ఛేంజ్.. మస్క్ వైరల్ ట్వీట్

Twitter లో "W" బ్యాగ్రౌండ్ ఛేంజ్.. మస్క్ వైరల్ ట్వీట్

ఎలాన్ మస్క్ 44మిలియన్ డాలర్లతో ట్విట్టర్ ను ఆధీనంలోకి తెచ్చుకుని దాదాపు ఆరు నెలలు పూర్తయిది. ఈ ఆర్నెళ్ల కాలంలో మస్క్ తీసుకున్న నిర్ణయాల వల్ల ట్విట్టర్ లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ఆయన వివాదాస్పద నిర్ణయాలు కొన్ని సార్లు ఉద్యోగులకు ఆటంకంగానూ మారాయి. ట్విట్టర్ ను చేజిక్కించుకున్న తొలి నాళ్లలోనే 50శాతం మందికి పైగా స్టాఫ్.. తమ ఉద్యోగాలను కోల్పోవాల్సి వచ్చింది. తాజాగా ట్విట్టర్ పేరు మార్పుపైన ఆయన దృష్టి పెట్టారు. ట్విట్టర్ ఇంగ్లీష్ వర్డ్  Twitterలోని  "W"ను తీసివేసేశారు. దీంతో ట్విట్టర్ ఇక నుంచి టిట్టర్ అన్న వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

ట్విట్టర్ ఇప్పుడు టిట్టర్..?

ఎలాన్ మస్క్ తాజాగా యూఎస్ శాన్ ఫ్రాన్సిస్కోలోని ట్విట్టర్ ప్రధాన కార్యాలయం బయట కంపెనీ పేరులో "W"ని కవర్ చేశారు. దీనికి సంబంధించిన ఓ ఫొటోను కూడా ఆయన షేర్ చేశారు. దాంతో పాటు SF హెడ్ క్వార్టర్ లోని తమ కార్యాలయంలో Twitter లోని W" చట్టబద్ధమైన గుర్తుగా ఉంచాలనుకుంటున్నామని, "w"ని తీసివేయలేమని చెప్పారు. ప్రస్తుతం దాని బ్యాగ్రౌండ్ రంగును మాత్రమే మార్పు చేశామని.. ప్రాబ్లమ్ సాల్వ్ అయిందంటూ మస్క్ రాసుకొచ్చారు. అంతకు ముందు ట్విట్టర్ ను టిట్టర్ అని మార్పు చేయాలని భావిస్తున్నట్టు ప్రకటించిన ఆయన.. తాజాగా చేసిన ఈ ట్వీట్ చేసి స్పష్టం చేశారు.

https://twitter.com/elonmusk/status/1645266104351178752