
వాగ్ బక్రీ టీ గ్రూప్ యజమాని, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ కన్నుమూశారు. బ్రెయిన్ హెమరేజ్‌తో కొన్ని రోజులు వెంటిలేటర్‌పై ఉన్న ఆయన.. అక్టోబర్ 22న సాయంత్రం మరణించారు. ప్రస్తుతం దేశాయ్‌కి 49 ఏళ్లు. వారం రోజుల కిందట పరాగ్.. పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా అకస్మాత్తుగా పడిపోయి.. బ్రెయిన్ హెమరేజ్‌కు గురయ్యాడు. దీంతో ఆయన్ను వెంటనే ఆస్పత్రిలో చేర్చారు. అలా ఆయన వారం రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు.
ఈ సందర్భంగా ఆ సంస్థ ఆయనకు ఓ ప్రకటనతో తమ సంతాపాన్ని వ్యక్తం చేసింది. “ప్రగాఢమైన శోకంతో.. మా ప్రియమైన పరాగ్ దేశాయ్ మరణాన్ని తెలియజేయడానికి మేము చింతిస్తున్నాము” అని ప్రకటనలో తెలిపింది. "అక్టోబర్ 15న తనపై దాడి చేసిన వీధికుక్కలను తిప్పికొట్టేందుకు ప్రయత్నించి, పరాగ్ తన నివాసం వెలుపల జారిపడడడంతో షెల్బీ ఆసుపత్రికి తరలించారు" అని అహ్మదాబాద్ మిర్రర్ నివేదించింది. కాగా అతనికి భార్య, కూతురు ఉన్నారు.