బరువు తగ్గేందుకు చాలా మార్గాలు ఉంటాయి. అయితే, వాటి వల్ల ఎంత వరకు ఫలితం ఉంటుందనేది పెద్ద ప్రశ్న! అయితే జపాన్ పురాతన కాలం నుంచి బరువు తగ్గేందుకు ఒక పద్ధతిని ఫాలో అవుతున్నారు. బరువు తగ్గడం కోసం మనదేశంలో చాలా మంది ఉదయాన్నే నిమ్మరసం తాగుతారు. అదే జపాన్ లో అయితే గ్లాసుడు గోరువెచ్చని నీటితో పాటు అరటి పండు తీసుకుంటారు. ఈ డైట్ ను జపాన్ ‘అసా’ అంటారు. జపనీయులు అనుసరిస్తున్న ఈ విధానం శాస్త్రీయమైనది..ప్రతిరోజు ఇలా చేస్తే బరువు తగ్గుతారని తేలింది. నిపుణులు చెప్పినదాని ప్రకారం.. గోరువెచ్చని నీళ్లు శరీరంలోని మెటబాలిజాన్ని పెంచుతాయి. దీంతో త్వరగా కొవ్వు కరుగుతుంది. అయితే, దీని వల్ల త్వరగా నీరసం వచ్చే ప్రమాదం ఉంది. అందుకే వేడి నీళ్లు తాగిన కాసేపటికి అరటిపండు తింటారట జపనీయులు. అరటిపండు తింటే తక్షణ శక్తి వస్తుంది. దాంతో నీరసం అనేది కనిపించదు.
అలాగే కడుపు నిండినట్టు అనిపించడం వల్ల తరచూ ఏదో ఒకటి తినాలనిపించదు. అరటిపండు తిని కాముగా ఉంటే చాలదు. తర్వాత అరగంట పాటు నడవాలి. తర్వాత రెండు అరటిపండ్లు తీసుకోవాలి. ఇలాంటి నియమం పాటిస్తే ఒకటి, రెండు వారాల్లోనే బరువు తగ్గుతారన్నది జపనీయులు చెబుతున్న మాట.