కేంద్ర ఆర్థిక వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తోంది?

కేంద్ర ఆర్థిక వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్టు కనిపిస్తోంది?

కేంద్ర ప్రభుత్వ ఉచిత వ్యతిరేక వైఖరిపై ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు ఉచిత హామీలను వ్యతిరేకిస్తున్న విధానంలో కేంద్ర వైఖరి స్పష్టంగా తెలియజేయాలన్నారు. అసలు  ఆర్థిక వ్యవస్థలో ఏదో లోపం ఉందన్నారు. అందుకే పేదలపై పన్నుల భారం మోపి ..బిలినీయర్ల రుణాలను మాఫీ చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్రం సొమ్ము అంతా ఎక్కడికి పోయింది? ఈ ప్రభుత్వ సొమ్ముతో వారు తమ స్నేహితుల రుణాలను మాఫీ చేస్తున్నారు. కేంద్రం బిలియనీర్ స్నేహితుల పన్నులను  పూర్తిగా 
మాఫీ చేసిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్అన్నారు. 

 సంపన్నులకు చెందిన కంపెనీలు చెల్లించాల్సిన రూ.10 లక్షల కోట్లు, రూ.5 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేసిందని తెలిపారు. పేదవాడు మార్కెట్ నుంచి కొనుగోలు చేసే గోధుమలు, బియ్యం, నిత్యావసరాలపై మాత్రం పన్నులు వేసి వసూలు చేస్తున్నారని తెలిపారు. అగ్నిపథ్ డిఫెన్స్ రిక్రూట్‌మెంట్ స్కీమ్, కేంద్ర పన్నుల్లో రాష్ట్రాల వాటా తగ్గింపు, ఆహార పదార్థాలపై విధించిన  జీఎస్టీ,MNREGA ఫండ్‌లో 25 శాతం కోతలు విధించడంపై మండిపడ్డారు. అసలు ఈ  డబ్బు అంతా ఎక్కడికి పోతుందని ప్రశ్నించారు.


పెట్రోలు, డీజిల్‌పై ఏడాదికి రూ. 3.5 లక్షల కోట్లకుపైగా కేంద్రం భారీ మొత్తంలో పన్నులు వసూలు చేస్తుంది. ఇప్పటికీ దేశంలోని ప్రజలకు ఉచిత విద్య, వైద్యం, మౌలిక వసతులు కల్పించడంలో  సెంట్రల్ సర్కార్ ఎందుకు  వ్యతిరేకిస్తుందో  సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సైనికులకు పెన్షన్ చెల్లించడానికి కూడా నిధులు లేవని చెప్పడం వెనుక హఠాత్తుగా ఏమి జరిగిందో వివరణ ఇవ్వాలని సూచించారు. ఆర్థిక వ్యవస్థలో ఏదో లోపం ఉన్నట్లు కనిపిస్తోందని కేజ్రీవాల్అనుమానం వ్యక్తం చేశారు.

గత 75 ఏండ్లలో ఎప్పుడూ ఆహార ధాన్యాలపై ప్రభుత్వం పన్ను విధించలేదు. ఇప్పుడు  కేంద్ర ప్రభుత్వం పేదలకు అందించే ఉచిత పథకాలన్నీ నిలిపివేయాలంటుంది. ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రుల్లో ఫీజులు వసూలు చేయాలని అంటున్నారు. ఉచిత రేషన్లు నిలిపివేయాలని చెబుతున్నారని  కేజ్రీవాల్ మండిపడ్డారు.