నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి

వనపర్తి, వెలుగు : నిరుపేదల సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని, సంక్షేమ పథకాల ఫలాలు ప్రతి గడపకు అందుతున్నాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సీఎంఆర్ఎఫ్ , కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండేండ్లలో నియోజకవర్గంలో 15 విడతల్లో మొత్తం 12,082 మందికి రూ. 71,43,09,360 విలువైన వివిధ చెక్కులను అందజేశామని, మహిళా సంఘాలకు రూ. 359 కోట్ల వడ్డీ లేని రుణాలు అందించామని వివరించారు.

మేఘన్న అభయహస్తం ద్వారా మరణించిన కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తుంటే కొందరు రాజకీయం చేయడం తగదన్నారు. మున్సిపల్ చైర్‌‌‌‌ పర్సన్ మాధవి, మార్కెట్ కమిటీ చైర్​పర్సన్ శ్రీనివాస్ గౌడ్. ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.