వనపర్తిలోని వెంకన్న ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు

వనపర్తిలోని వెంకన్న ఆలయ అభివృద్ధికి రూ.2 కోట్లు

వనపర్తి, వెలుగు: వనపర్తిలోని వేంకటేశ్వరస్వామి ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం రూ.2 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి తెలిపారు. ఈ మేరకు జీవో జారీ చేసినట్లు చెప్పారు. అంతకుముందు రూ.కోటి మంజూరు చేయగా, తాజాగా మరో రెండు కోట్లు మంజూరు చేసిందని చెప్పారు. ఈ నిధులతో  పూజారుల గదులు, మండపాలు, ఇతర అభివృద్ధి చేపట్టనున్నట్లు తెలిపారు. 

వచ్చే ఏడాది బ్రహ్మోత్సవాల సమయానికి ఆలయాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ముందుకెళ్తున్నామని చెప్పారు. నిధులు మంజూరు చేసిన సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.