సాయిపల్లవి లాగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా : అపూర్వ రావ్‌‌‌‌‌‌‌‌

సాయిపల్లవి లాగా పేరు తెచ్చుకోవాలని కోరుకుంటున్నా : అపూర్వ రావ్‌‌‌‌‌‌‌‌

యష్ పూరి హీరోగా కౌశిక్ భీమిడి దర్శకత్వంలో హమ్స్ టెక్ ఫిలింస్, సిల్లీ మాంక్స్ స్టూడియోస్ సంస్థలు నిర్మించిన చిత్రం ‘హ్యాపీ ఎండింగ్‌‌‌‌‌‌‌‌’. అపూర్వ రావ్‌‌‌‌‌‌‌‌ ఈ చిత్రంతో హీరోయిన్‌‌‌‌‌‌‌‌గా పరిచయం అవుతోంది. ఫిబ్రవరి 2న సినిమా విడుదల సందర్భంగా అపూర్వ మాట్లాడుతూ ‘మాది ఒంగోలు. నాన్న ఉద్యోగరీత్యా గుజరాత్‌‌‌‌‌‌‌‌లో, ఆపై కువైట్‌‌‌‌‌‌‌‌లో పెరిగాను. తిరిగొచ్చాక గ్రాడ్యుయేషన్ చేసి, కొంతకాలం జాబ్స్ చేశాను. నటనపై ఆసక్తితో హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం స్కూల్‌‌‌‌‌‌‌‌లో ట్రైనింగ్ తీసుకున్నా. అక్కడి కామన్ ఫ్రెండ్స్ ద్వారా ఈ సినిమాకు ఆడిషన్స్ చేశా. ఇక కంటెంట్‌‌‌‌‌‌‌‌ను బట్టి ఇదొక యూత్ పుల్ మూవీ అనుకుంటున్నారు కానీ ఇందులో చాలా హ్యూమర్, ఫన్ ఉన్నాయి. 

పది నిమిషాలకు ఒకసారి హ్యాపీగా నవ్వుకుంటారు. ఇందులో హీరోకి ఒక శాపం ఉంటుంది. తను ఎవరి గురించి ఆలోచిస్తాడో వాళ్లకు సమస్యలు వస్తాయి. దానివల్ల అతను కొన్ని పనులు చేయలేకపోతాడు. అలాంటి అబ్బాయిని అర్థం చేసుకుని, సపోర్ట్‌‌‌‌‌‌‌‌గా నిలిచే యోగా టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాత్ర నాది. నా పాత్రకు నేనే డబ్బింగ్ చెప్పా. తొలిచిత్రానికే ప్రాధాన్యత గల పాత్ర రావడం హ్యాపీ. సాయిపల్లవి తరహాలో వెర్సటైల్ నటిగా పేరు తెచ్చుకోవాలని కోరు కుంటున్నా’ అని చెప్పింది.