మహిళలకు ప్రత్యేకం ఈ స్కూటర్లు..అత్యుత్తమ మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్, నడపడం సులభం

మహిళలకు ప్రత్యేకం ఈ స్కూటర్లు..అత్యుత్తమ మైలేజ్, లేటెస్ట్ ఫీచర్స్, నడపడం సులభం

మహిళల కోసం అత్యుత్తమ స్కూటర్లు.. నడపడం చాలా సులభం. ఈ స్కూటర్లు మహిళలకు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. ఏ స్కూటర్ కొనాలో తెలియక తికమక పడే వారికోసం ఈ 3ఎలక్ట్రిక్ స్కూటర్లు వాటి ఫీచర్లు, మైలేజీలో అత్యుత్తమమైనవి. 125 సీసీ కెపాసిటీ గల ఈ స్కూటర్లలో దేనినైనా కొనుగోలు చేయొచ్చు.
 
హోండా యాక్టివా 125: మహిళలకు మంచి స్కూటర్ అంటే 125సీసీ హోండా యాక్టివా125. దీన ధర రూ. 79,806(ఎక్స్ -షోరూమ్) నుంచి ప్రారంభం అవుతుంది. అక్టివా 125లో 124 సిసి BS6 ఇంజన్ ఉంటుంది. ఇది 8.30 PS పవర్, 10.4 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు భాగంలో డిస్క్ బ్రేక్ ఆప్షన్ కూడా ఉంటుంది. హోండా యాక్టివా 125 బరువు 109 కిలోలు. 5.3 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యం, స్మార్ట్ కీ, సైలెంట్ స్టార్ట్, డిజిటల్ మీటర్ కూడా ఉంటుంది. Activa 125 స్కూటర్ 55నుంచి 60 Kmpl  మైలేజీని ఇస్తుంది. 

సుజుకీ యాక్సెస్ 125:  సుజుకీ యాక్సెస్ 125 కూడా 125 సీసీ సెగ్మెంట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న స్కూటర్లలో ఒకటి. దీని ధర రూ. 79,899 (ఎక్స్ -షోరూమ్ ) నుంచి ప్రారంభమవుతుంది. దీని టాప్ మోడల్ లో డిస్క్ బ్రేక్ లు, అల్లాయ్ వీల్స్ తో కూడిన పూర్తి డిజిటల్ కన్సోల్ ఉంటాయి. యాక్సెస్ 125లో 124సీసి ఇంజన్ ఉంటుంది.ఇది 8.7 PS పవర్ , 10Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. యాక్సెస్ 103 కేజీల బరువు, 5 లీటర్ల ఇంధన ట్యాంక్ సామర్థ్యంతో వస్తుంది. ఫుల్ సైజ్ హెల్మెట్ ను ఉంచుకునేందుకు ఇది అండర్ సీట్ స్టోరేజీని కలిగి ఉంది. యాక్సెస్ 125 స్కూటర్ 55-60 కి.మీ మైలేజీని ఇస్తుంది. 

టీవీఎస్ జూపిటర్: టీవీఎస్ జూపిటర్ 125 ని దాని ప్రాక్టికల్ ఫీచర్ల కారణంగా ప్రజలు బాగా ఇష్టపడుతున్నారు. దీని ధర రూ. 86,405( ఎక్స్ -షోరూమ్ ) నుంచి ప్రారంభమవుతుంది. జుపిటర్ ముందు భాగంలో 2 లీటర్ల సామర్థ్యం ఉన్న ఇంధన నింపే టోపి ఉంటుంది. దీనిని మీరు సీటు పై కూర్చొని తెరవవచ్చు. ఇది కాకుండా 33 లీటర్ల పెద్ద అండర్ సీట్ స్టోరేజ్ స్పేస్ కూడా ఉంటుంది. ట్యూబ్ లెస్ టైర్లతో ఈ స్కూటర్ అన్ని వేరియంట్ లలో అందుబాటులో ఉంది. టాప్ వేరియంట్ లో డిస్క్ బ్రేక్ లు, డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ కన్సోల్ తో పాటు అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి.