అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

అల్లు అర్జున్‌తో నటించాలని ఉంది

హైదరాబాద్: టాలీవుడ్ లో అల్లు అర్జున్ తో నటించాలని ఉందని డీజే టిల్లు ఫేమ్, హీరోయిన్ నేహాశెట్టి తన మనసులో మాట బయటపెట్టారు. అలాగే అన్ కట్ డైమండ్ జువెలరీ అంటే ఇష్టమన్నారు  హీరోయిన్ నేహాశెట్టి. హైదరాబాద్ బంజారాహిల్స్ లో కలాశా జూవెలరీ షోరూం ఐదో వార్షికోత్సవం సందర్భంగా కాఫీ టేబుల్ బుక్ ను ఆమె లాంచ్ చేశారు. డైమండ్ జూవెలరీ కలెక్షన్లను రిలీజ్ చేశారు. 

తెలుగు వారితో కనెక్ట్ అయ్యా.. డీజే టిల్లు సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నా
తెలుగు ప్రేక్షకులు, భాషపై ఇష్టంతోనే తాను తెలుగు భాషను మాట్లాడడం నేర్చుకున్నానని నేహా శెట్టి చెప్పారు. తెలుగు సినిమాలు, నటులు అంటే తనకు ఇష్టమని.. డీజే టిల్లు సక్సెస్ కావడంతో తాను ఎక్కడకు వెళ్లినా అందరూ గుర్తు పట్టి పలుకరిస్తున్నారని.. సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నానని పేర్కొన్నారు. తన సినిమాను సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఘతలు తెలిపారు నేహాశెట్టి. సినిమాల్లో నటించాలనేది తన ఆకాంక్ష అని.. అయితే పర్టిక్యులర్ గా ఇలాంటి సినిమా చేయాలని గాని.. పెద్ద సినిమా చేయాలని గాని అనుకోలేదని అన్నారు. 

 

ఇవి కూడా చదవండి

విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్ విధించిన అకాడమీ

పార్టీలకు హాజరైన మోడల్స్ గురించి పోలీసుల ఆరా

కాంగ్రెస్ సీనియర్లపై సోనియాకు అద్దంకి ఫిర్యాదు

ఎంజీఎంలో శాలరీస్..​ ప్రైవేట్‍ హాస్పిటల్స్​లో ప్రాక్టీస్