విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్ విధించిన అకాడమీ

విల్ స్మిత్పై పదేళ్ల బ్యాన్ విధించిన అకాడమీ

వాషింగ్టన్: ఒక్క చెంపదెబ్బ కొట్టినందుకు ప్రముఖ హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. ఆస్కార్ అవార్డు గ్రహీత విల్ స్మిత్పై మోషన్ పిక్చర్ అకాడమీ చర్యలు తీసుకుంది. పదేళ్లపాటు ఆస్కారు వేడుకల్లో పాల్గొనకుండా ఆయనపై బ్యాన్ విధించింది. ఇతర అకాడమీ పురస్కారాల వేడుకల్లోనూ పాల్గొనకుండా పదేళ్లపాటు నిషేధం విధించారు. రీసెంట్ గా జరిగిన 94వ ఆస్కార్ వేడుకల సందర్భంగా తన భార్యపై కామెంట్ చేయడంతో కమెడియన్ క్రిస్ రాక్ ను విల్ స్మిత్ చెంపదెబ్బ కొట్టారు. దీంతో అందరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. విల్ స్మిత్ బహిరంగంగా క్షమాపణ చెప్పినప్పటికీ.. ఆయనపై చర్యలు తీసుకునేందుకు బోర్డు అకాడమీ గవర్నర్ లు శుక్రవారం సమావేశమయ్యారు. స్మిత్ వ్యవహార శైలిని తప్పుబట్టిన అకాడమీ.. ఆయన మీద 10 సంవత్సరాలు బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంపై విల్ స్మిత్ స్పందించారు. అకాడమీ నిర్ణయాన్ని గౌరవిస్తున్నట్లు తెలిపాడు. 

మరిన్ని వార్తల కోసం:

సీనియర్ నటుడు బాలయ్య కన్నుమూత

ఎగ్జామ్​ ఏదైనా... జీఎస్​ కామన్​

బీస్ట్.. నెక్స్ట్​ లెవెల్​