బన్నీతో కలిసి నటించాలనుంది : హీరో భరత్

బన్నీతో కలిసి నటించాలనుంది : హీరో భరత్

బాయ్స్, ప్రేమిస్తే, యువసేన లాంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన తమిళ హీరో భరత్.. కొంత గ్యాప్ తర్వాత తెలుగులో నటించిన చిత్రం ‘హంట్’. సుధీర్‌‌బాబు హీరోగా  మహేష్ దర్శకత్వంలో వి. ఆనంద ప్రసాద్ నిర్మించారు. ఈనెల 26న సినిమా విడుదలవుతున్న సందర్భంగా భరత్ మాట్లాడుతూ ‘తమిళ చిత్రాలతో బిజీగా ఉండడంతో ఇక్కడ దృష్టి పెట్టలేదు. అయితే మహేష్‌‌ చెప్పిన స్క్రిప్ట్ చెప్పగానే నచ్చింది. అదీకాక సీసీఎల్‌‌ వల్ల సుధీర్‌‌బాబు నాకు మంచి ఫ్రెండ్.

అలా అన్నీ కుదిరి  పన్నెండేళ్ల తర్వాత తెలుగులో మళ్లీ నటించా. ఆర్యన్ దేవ్ అనే ఐపీఎస్ ఆఫీసర్‌‌‌‌గా కనిపిస్తా. యాక్షన్, క్రైమ్, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌‌తో పాటు ఎమోషన్, ఫ్రెండ్‌షిప్ లాంటివన్నీ ఉంటాయి. అందరూ ఇలాంటి యాక్షన్, ఎమోషనల్, రొమాంటిక్ స్క్రిప్టులతోనే నన్ను అప్రోచ్ అవుతున్నారు. కానీ నాకు ఓ ఫుల్‌‌ లెంగ్త్‌‌ కామెడీ మూవీలో నటించాలనుంది. అలాగే కంప్లీట్ రా ఏజెంట్‌‌గా నటించాలనే కోరిక ఉంది. అలాగే అల్లు అర్జున్‌‌తో కలిసి నటించాలనుంది. ‘గంగోత్రి’ నుండి తన జర్నీ చూస్తున్నా. నటుడిగా ఆయనంటే ఇష్టం. ’ అన్నాడు.