రాష్ట్రంలో వక్ఫ్ బోర్డ్ ఆస్తులు అన్యాక్రాంతమవడం బాధాకరమని సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ మెంబర్లు నౌషాద్, వసీం, హనీఫ్ చెప్పారు. నాంపల్లిలోని వక్ఫ్బోర్డ్ఆఫీసులో చైర్మన్మహమూద్సలీంతో సెంట్రల్వక్ఫ్ కౌన్సిల్ సోమవారం సమావేశమైంది. రాష్ట్రంలోని వక్ఫ్ప్రాపర్టీ వివరాలను కౌన్సిల్మెంబర్లు బోర్డ్చైర్మన్ను అడిగి తెలుసుకున్నారు. ఆస్తులు ప్రైవేటు వ్యక్తుల పరం కావడాన్ని ప్రశ్నించారు. రికార్డు రూంను ఎలా సీజ్చేస్తారని సభ్యులు నిలదీశారు. తమ రికార్డుల ప్రకారం బోర్డుకు రాష్ట్రంలో 77 వేల ఎకరాల భూమి ఉందన్నారు. కానీ వక్ఫ్‌బోర్డుకు 40 వేల ఎకరాలు ఉన్నాయని అసెంబ్లీలో ప్రభుత్వం ప్రకటించిందన్నారు. మిగిలిన 37 వేల ఎకరాలు, ఇతర ఆస్తులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఆస్తుల వివరాలను ఎందుకు దాస్తున్నారని నిలదీశారు
