హైదరాబాద్ సిటీ, వెలుగు: కంట్రీ క్లబ్ హాస్పిటాలిటీ అండ్ హాలిడేస్ ఆధ్వర్యంలో ఆసియాలోనే అతిపెద్ద న్యూ ఇయర్వేడుకలను ‘వార్ ఆఫ్ ది డీజేస్’ పేరిట నిర్వహించనున్నారు. రసూల్‌పూరలోని పోలీస్ హాకీ స్టేడియంలో డిసెంబర్ 31న రాత్రి ఈ మెగా ఈవెంట్ నిర్వహించనున్నట్లు కంట్రీ క్లబ్ సీఎండీ, సీసీహెచ్‌హెచ్‌ఎల్ చైర్మన్ వై.రాజీవ్ రెడ్డి ప్రకటించారు.
మంగళవారం బేగంపేట కంట్రీ క్లబ్‌లో జరిగిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో వై.రాజీవ్ రెడ్డి ‘ఆసియా బిగ్గెస్ట్ న్యూ ఇయర్ బాష్ 2026’ పోస్టర్ ఆవిష్కరించారు. ప్రముఖ నటి, ఫోక్ డ్యాన్స్ ఐకాన్ సిమ్రాన్ అహుజా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ ఏడాది కూడా ముంబై, పుణె, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా, ఢిల్లీ, సూరత్ లో తమ క్లబ్‌లు, రిసార్ట్‌లలో ఈ ఈవెంట్లను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. హైదరాబాద్‌లో ప్రధాన వేడుక ‘వార్ ఆఫ్ ది డీజేస్’గా జరుగుతుందన్నారు.

