గ్రేటర్ వరంగల్/ కాశీబుగ్గ, వెలుగు: ప్రజాపాలన - ప్రగతి ప్రణాళికలో భాగంగా అటవీ, పర్యావరణ పరిరక్షణ అంశాలపై అవగాహన కల్పించేందుకు మంగళవారం వరంగల్ ఐఎంఏ హాల్‌లో బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన వరంగల్ కలెక్టర్ సత్య శారద మాట్లాడుతూ ప్రజారోగ్య పరిరక్షణతో పాటు పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో బయోమెడికల్ వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ కీలకమన్నారు. అనంతరం ఆమె వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించారు.
కొత్తగా కొలువుదీరిన పాలకవర్గం, వ్యాపారస్తులతో మాట్లాడారు. ముందుగా మార్కెట్ చైర్పర్సన్ఎర్ర ప్రియాంకకు బొకే అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. మిర్చి యార్డులోని రైతులు, వ్యాపారులతో మాట్లాడి సమస్యలపై ఆరా తీశారు. గోదాముల్లో భద్రపర్చిన ఈవీఎంలను తనిఖీ చేశారు. కాగా, కేంద్ర ప్రభుత్వం అందించే ప్రధాన్ మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్–2026 కోసం నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు కలెక్టర్ సత్యశారద తెలిపారు.
నామినేషన్లకు జులై 31 చివరి తేదీ, జిల్లాస్థాయిలో పరిశీలన కోసం సంబంధింత వివరాలను ఈ నెల 30 లోగా కలెక్టర్ ఆఫీస్‌లో సమర్పించాలని సూచించారు.
