రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి : వరంగల్ సీపీ సన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్

రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలి : వరంగల్ సీపీ సన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్

హసన్ పర్తి, వెలుగు: భూతగాదాల కేసుల్లో  సెటిల్‌‌‌‌‌‌‌‌మెంట్లకు పాల్పడుతూ ప్రజలను ఇబ్బందులకు గురిచేసే రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించాలని వరంగల్ సీపీ సన్‌‌‌‌‌‌‌‌ప్రీత్ సింగ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం కేయూసీ పీఎస్​ను ఆయన సందర్శించారు. 

ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ స్టేషన్ ఎస్సైలు అప్పగించిన సెక్టార్ పరిధిలో నేరాల నియంత్రించడంతో పాటు ముందస్తూ సమాచారాన్ని సేకరించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత, ఏసీపీ నర్సింహరావు తదితరులు పాల్గొన్నారు.