ప్లాస్టిక్ రహిత మేడారం జాతర జరుపుకోవాలి : పర్యావరణ వేత్త ప్రకాశ్

ప్లాస్టిక్ రహిత మేడారం జాతర జరుపుకోవాలి : పర్యావరణ వేత్త ప్రకాశ్

హనుమకొండ సిటీ, వెలుగు: మేడారం మహాజాతరను ప్లాస్టిక్ రహితంగా జరుపుకోవాలని, ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వస్తువులను దూరం పెట్టాలని వరంగల్ నగరానికి చెందిన పర్యావరణ వేత్త ప్రకాశ్ పిలుపునిచ్చారు. స్వచ్ఛ మేడారం జాతర లక్ష్యంగా సోమవారం హనుమకొండ కాళోజీ సెంటర్ వద్ద ఒకరోజు నిరవధిక దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వచ్ఛ మేడారమే లక్ష్యంగా గత పదేండ్లుగా పాదయాత్రలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

మేడారం జాతరకు తరలివచ్చే భక్తులు ప్లాస్టిక్ వస్తువులు ఉపయోగించవద్దన్నారు. స్టీల్ ప్లేట్లు, స్టీల్ గ్లాసులు, జ్యూట్ బ్యాగులు, పేపర్ వస్తువులు మాత్రమే వినియోగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకాశ్ చేపట్టిన దీక్షకు లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు సుంకరి ప్రశాంత్, వందేమాతరం ఫౌండేషన్ ప్రతినిధి విష్ణు, పర్యావరణ ప్రేమికులు కృష్ణ, సంపత్, ప్రసాద్, సుశాంత్, ప్రసన్న కుమార్ తదితరులు మద్దతు తెలిపారు.