
- అదుపులోకి తీసుకున్న హనుమకొండ పోలీసులు
గ్రేటర్ వరంగల్, వెలుగు: గ్రేటర్వరంగల్మున్సిపల్ కార్పొరేషన్మాజీ మేయర్ ను హనుమకొండ పోలీసులు అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళ్తే... భవితశ్రీ చిట్‌ఫండ్‌లో చేరి చీటీలు వేసిన సభ్యులకు డబ్బులు ఇవ్వడం లేదనే బాధితుల ఫిర్యాదుతో బుధవారం రాత్రి మాజీ మేయర్ ప్రకాశ్‌రావును అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఇప్పటికే పలువురు బాధితులు పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేసినట్లు, పోలీసులు మరిన్ని వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది. గుండా ప్రకాశ్అరెస్ట్ వ్యవహారం చిట్ ఫండ్ వర్గాల్లో కలకలం రేపింది.