
హనుమకొండ/ కాశీబుగ్గ/ ఖిలా వరంగల్(మామునూరు). వెలుగు: ఈ నెల 14న మిస్‌వరల్డ్ కంటిస్టెంట్స్ వరంగల్ కోటకు రానున్నందున సోమవారం వరంగల్, హనుమకొండ కలెక్టర్లు సత్యశారద, ప్రావీణ్య, సీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే అతిథులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు.
అనంతరం హరిత కాకతీయలో ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ షోబోట్ ప్రతినిధులతో కలిసి ఏర్పాట్లు పరిశీలించి, పలు సూచనలు చేశారు. కార్యక్రమంలో అడిషనల్సీపీ షేక్‌సలీమా, ఏసీపీ నందిరామ్ నాయక్ తదితరులున్నారు. కాగా, కోటలోని శిల్పాలను పురావస్తు శాఖ సిబ్బంది శుభ్రం చేస్తున్నారు.