- మూడో విడతలకు తొలిరోజు పెద్ద సంఖ్యలో నామినేషన్ల దాఖలు
- ప్రక్రియను పరిశీలించిన అధికారులు
హనుమకొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని రెండో విడత ఎలక్షన్ జరగనున్న 564 జీపీల్లో సర్పంచ్ స్థానాలకు 3,796 నామినేషన్లు, 4,928 వార్డుస్థానాలకు 12,457 నామినేషన్లు దాఖలు అయ్యాయి. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అభ్యర్థుల తుది జాబితా వెల్లడించనున్నారు. ఈ నెల 14న రెండో విడత ఎన్నికలు జరగనుండగా, అదే రోజు ఫలితం తేలనుంది. మరోవైపు మూడో విడత నామినేషన్లు షురూ అయ్యాయి. బుధవారం అభ్యర్థులు భారీ సంఖ్యలో నామినేషన్లు వేశారు. అంతకుముందు ర్యాలీగా కేంద్రాలకు చేరుకున్నారు.
నామినేషన్ సెంటర్ల పరిశీలన..
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గంలోని చెన్నారావుపేట, నెక్కొండ మండలాల్లోని పలు నామినేషన్ కేంద్రాలను వరంగల్ జిల్లా రిటర్నింగ్ ఆఫీసర్, కలెక్టర్ సత్యశారద బుధవారం పరిశీలించారు. చెన్నారావుపేట మండలంలోని ఉప్పరపల్లి, నెక్కొండ మండలంలోని అమీన్‌పేట నామినేషన్ సెంటర్లను పరిశీలించి, నామినేషన్ల వివరాలను అడిగి తెలుసుకున్నారు.
మండలాల్లో మూడో విడత నామినేషన్లు..
నర్సంపేట/ కొత్తగూడ: మూడో విడత నామినేషన్ల ప్రక్రియ ఉమ్మడి జిల్లాలోని ఆయా మండలాల్లో బుధవారం ప్రారంభమైంది. వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలో మొత్తం 19 గ్రామ పంచాయతీలు ఉండగా, మొదటి రోజు 12 మంది అభ్యర్థులు సర్పంచ్‌స్థానాలకు, 164 వార్డులు ఉండగా 24 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు.
చెన్నారావుపేట మండలంలో 30 జీపీలు ఉండగా, ఏడుగురు అభ్యర్థులు, 258 వార్డు స్థానాలకు ఇద్దరు, ఖానాపురం మండలంలో 21 జీపీలు ఉండగా, 17 మంది సర్పంచ్‌కి, 184 వార్డులు ఉండగా 36 మంది అభ్యర్థులు, నెక్కొండ మండలంలో 39 జీపీలు ఉండగా, 15 మంది సర్పంచ్ స్థానాలకు, 340 వార్డులకు 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలో 8 సర్పంచ్ నామినేషన్లు, 4 వార్డు స్థానాలకు నామినేషన్లు వేశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో రెండో విడత ఎన్నికల కోసం దాఖలైన
జిల్లా మండలాలు జీపీలు సర్పంచ్ వార్డు స్థానాలు దాఖలైన
నామినేషన్లు నామినేషన్లు
హనుమకొండ 5 73 524 694 1,838
వరంగల్ 4 117 830 1008 2,759
జనగామ 4 79 551 710 1,738
జయశంకర్ 4 85 529 694 1,624
భూపాలపల్లి
ములుగు 3 52 244 462 1064
మహబూబాబాద్ 7 158 1,118 1,360 3,434
మొత్తం 27 564 3,796 4,928 12,457
మూడో విడతలో మొదటి విడతలో వచ్చిన నామినేషన్లు
జిల్లా మండలాలు జీపీల సర్పంచులు వార్డు సంఖ్య సభ్యులు
వరంగల్ 4 109 51 73
హనుమకొండ 4 68 56 85
జనగామ 4 91 41 37
భూపాలపల్లి 4 81 106 175
ములుగు 3 46 11 22
